నాగర్ కర్నూల్: గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

53చూసినవారు
నాగర్ కర్నూల్: గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటగది, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్లను, వంట వండే పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సదవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలని, చదువుకుంటేనే భవిష్యత్తులో ఉజ్వల భవిత అందుతుందని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్