వంగూర్ మండలం కొండారెడ్డి పల్లిలో నాగనూలు లక్ష్మమ్మ ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్నబియ్యం భోజనాన్ని వారి కుటుంబ సభ్యులు ఇతర జిల్లా అధికారులతో కలసి శనివారం జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ భోజనం చేశారు. ప్రభుత్వం ఉగాదిన ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీతో ఇలాంటి పేదవారికి ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. సన్నబియ్యంతో భోజనం సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు.