అచ్చంపేటలో భారీ వర్షం

2చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో మొలకలు ఎదగడానికి ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. అకస్మాతుగా వర్షం రావడంతో విద్యార్థులు, వ్యాపారస్తులు, కార్మికులు, కూలీలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పిడుగులు పడే అవకాశం ఉందని, చెట్ల కింద ఉండొద్దని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్