కల్వకుర్తి: సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

84చూసినవారు
మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లిలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం హర్షణీయమని నాయకులు అన్నారు. నాయకులు నూకం శేఖర్, యాదగిరి, నరేష్, మల్లేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్