నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఊర్కొండలో గ్రామ పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్న దార జంగయ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల ప్రకారం. శుక్రవారం తన మోటార్ సైకిల్ కు సాంకేతిక సమస్య తలెత్తడంతో మరో బైక్ తో తాడు కట్టుకుని వస్తుండగా ముందుగా వెళ్తున్న బైక్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన జంగయ్యను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.