నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్ తండా ప్రభుత్వ పాఠశాలలో టీఎస్ యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకుడు జె. బాలరాజు మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల అధ్యక్షుడు నెహ్రూ ప్రసాద్ పాల్గొన్నారు.