నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం ఒక వ్యక్తి గుర్రంపై వచ్చి తాను "దేశ గురువును" అని చెప్పుకుంటూ అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయబోయాడు. గ్రహించిన కొందరు యువకులు అతనిని నిలదీయగా, అతను తడబడుతూ సమాధానం చెప్పాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు అతడిని గ్రామం నుంచి తరిమివేశారు. ఇలాంటి దొంగస్వాముల మాయమాటలు నమ్మి మోసపోవద్దని గ్రామస్థులు హెచ్చరించారు.