నీటి సంపులో పడి మహిళ మృతి చెందిన సంఘటన మంగళవారం నాగర్ కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది వివరాల ప్రకారం. కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీకి చెందిన రుద్రాక్ష బాలమ్మ (65) ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో ప్రమాదవశాత్తు పడి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.