భారత రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి, ముక్కిడిగుండంలో మంత్రి జూపల్లి పాదయాత్ర చేశారు. జూపల్లి మాట్లాడుతూ. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రను పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. రాజ్యాంగాన్ని విలువలను గౌరవిస్తూ రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుందని అన్నారు.