కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని మంగళవారం కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా, రైతులకు విత్తనాలు తదితర పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని పార్టీ జిల్లా కార్యదర్శి పర్వతాలు అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.