కొల్లాపూర్ నియోజక వర్గం వీపనగండ్ల మండలం సంపట్రావుపల్లికి చెందిన నవీన్ అదృశమయ్యాడు. శుక్రవారం ఎస్ఐ హరిప్రసాద్ వివరాల ప్రకారం.. ఉమారాణి, నవీన్ దంపతులు వనపర్తిలోని భగీరథ కాలనీలో నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కొన్ని రోజులుగా వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరి ఇప్పటివరకూ నవీన్ తిరిగి రాలేదు. అతడి భార్య ఉమారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.