కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారిపై గతకొన్ని రోజులుగా వీధిలైట్లు వెలగక చీకటితో అంధకారంలో ఉంది. జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి జబర్దస్త్ హోటల్ కార్నర్ వరకు రాత్రి వేళలో కుక్కల భయంతో పట్టణ ప్రజలు, పాదాచార్లు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఫోర్ వీలర్, టూ వీలర్ వస్తే దాని వెలుతురు వస్తే తప్ప పాదాచారుల వెళ్లలేకపోతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే వీధిలైట్లు ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.