కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్ల మండలంలోని గోపాల్ దీన్నే-సింగోటం లింక్ కెనాల్ ద్వారా వీపనగండ్ల, చిన్నంబాయి మండలాలలో లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం సంగినేనిపల్లి వద్ద లింక్ కెనాల్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. చిన్నంబావి, వీపనగండ్ల మండలాలు సస్యశ్యామలంగా మారనున్నాయి. ఈ కెనాల్ నిర్మాణానికి రూ. 1. 20కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు.