మనిషికి జీవితం చాలా విలువైనదని, ఆత్మహత్య చేసుకోవడం సరైన పని కాదని నాగర్ కర్నూల్ డీఎంహెచ్ఓ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి అన్నారు. మంగళవారం ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్బంగా కల్వకుర్తి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. మానసిక దృఢత్వం పెంచుకోవడానికి యోగా లాంటివి చేయాలన్నారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోరాదని జీవితంలో రాణించడానికి ఎన్నో మార్గాలున్నాయని అన్నారు.