ఉప్పునుంతల మండలంలోని మామిళ్ళపల్లి గ్రామానికి చెందిన కోలాటం మాస్టర్ పంబలి రామస్వామి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కోలాటం పోటీల్లో మొదటి బహుమతి పొంది నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రంతో పాటు బహుమతి శుక్రవారం అందుకున్నారు. అనంతరం వారి బృందాన్ని శాలువులతో సత్కరించారు. శనివారం ఢిల్లీలో జరగనున్న అన్ని రాష్ట్రాల పోటీల్లో పాల్గొనడానికి బయలుదేరినట్లు ఆయన తెలిపారు.