తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులను వేలం వేయడం వెంటనే నిలిపివేయాలని కోరుతూ కొల్లాపూర్ పట్టణంలో సిపిఎం నాయకులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు శివ వర్మ మాట్లాడుతూ. నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను మరింత వేగంగా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని అన్నారు.