నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి మబ్బులు కమ్ముకొని సాయంత్రం వర్షం కురవడంతో విద్యార్థులు, ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వరద నీటితో రోడ్లు జలమయమయ్యాయి. ఈ వర్షంతో మెట్ట పంటలకు, వేరుశనగ పంటకు మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.