బహుభాషా కోవిందుడు పివి నరసింహారావు: ఎమ్మెల్సీ

74చూసినవారు
బహుభాషా కోవిందుడు పివి నరసింహారావు: ఎమ్మెల్సీ
మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు బహుభాషా కోవిందుడని ఎమ్మెల్సీ కుచుకుళ్ళ దామోదర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో పివి నరసింహారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పీవీ నరసింహారావు భారత దేశ తొలి తెలుగు ప్రధాని, గొప్ప ఆర్థిక సంస్కరణ వేత్త, తెలంగాణ ముద్దుబిడ్డ అని కొనియాడారు. పట్టణ కౌన్సిలర్ లు, బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్