నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం రాత్రి ప్రారంభమైన కబడ్డీ పోటీలలో ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి పాల్గొని కొద్దిసేపు కబడ్డీ ఆడారు. ద్రోణాచార్య స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం స్థానిక క్రీడాకారులతో కలిసి ఎమ్మెల్యే కబడ్డీ ఆడారు.