నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరాన్ని బుధవారం జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి సందర్శించారు. డాక్టర్ స్వరాజ్యలక్ష్మి స్వయంగా కంటి రోగులకు పరీక్షలు నిర్వహించారు. 142 మందిని పరీక్షించి 38 మందికి కంటి ఆపరేషన్ కు మహబూబ్ నగర్ ల్యాండ్స్ ఆసుపత్రికి పంపించారు. డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రజలు కంటి వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు.