నాగర్‌ కర్నూల్‌: నీట్‌లో మంచి ర్యాంకు రాలేదని యువతి ఆత్మహత్య

52చూసినవారు
నాగర్‌ కర్నూల్‌: నీట్‌లో మంచి ర్యాంకు రాలేదని యువతి ఆత్మహత్య
నాగర్‌ కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం నారాయణపూర్‌ తండాలో విషాదం చోటు చేసుకుంది. నీట్‌లో మంచి ర్యాంకు రాలేదని ఓ యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం. ఇస్లావత్‌ శ్రావణి (19) నీట్‌లో ర్యాంక్ రాలేదని మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రావణికి రెండో ప్రయత్నంలోనూ నీట్‌లో మంచి ర్యాంకు రాకపోవడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్