బిజినేపల్లి మండల పరిధిలోని పాలెంలో విషాదం చోటుచేసుకుంది. అయ్యగారి బావిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులకు బుధవారం ఉదయం సమాచారం అందించారు. మృతి చెందిన వ్యక్తిని మొల్గర శ్రీనివాసులు (54)గా గుర్తించారు. మృతదేహం బయటకు తీసి నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడికి కుమార్తె, కొడుకు ఉన్నట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.