గురుకుల పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు సిబ్బంది కృషి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోశ్ అన్నారు. శుక్రవారం తెల్కపల్లి మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల మౌలిక సదుపాయాలు తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.