నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని బిఆర్టీసీ డిపో ముందు ప్రైవేట్ బస్సు డ్రైవర్ల సమ్మె బుధవారం చేశారు. డ్రైవర్లకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎక్కడికక్కడే ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. ఉదయం పూట పనులకు వెళ్లాలని ఆర్టీసీ బస్టాండ్ దగ్గరికి వస్తే బస్సులు చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.