తెలంగాణలోని పలు జిల్లాల్లో భిన్న వాతావరణం ఏర్పడింది. ఉదయంపూట ఎండ దంచికొట్టగా ప్రస్తుతం పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రాబోయే 2 గంటల్లో సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, మెదక్, రంగారెడ్డి, యాదాద్రి తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించారు.