నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని దోమలపెంట ఎస్ ఎల్ బి సి ఇన్లేట్ 1 ఆఫీస్ వద్ద గురువారం ఆర్మీ జనరల్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ అజయ్ మిశ్రా, కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులతో, టన్నెల్ లోపల ప్రమాద ప్రదేశంలో జరుగుతున్న సహాయక చర్యలపై తీసుకోవాల్సిన భద్రత ప్రమాణాలను విశ్లేషించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.