అమ్రాబాద్: మౌలిక వసతుల పై రాష్ట్ర విద్యా కమీషన్ చైర్మన్ పరిశీలన

74చూసినవారు
అమ్రాబాద్: మౌలిక వసతుల పై రాష్ట్ర విద్యా కమీషన్ చైర్మన్ పరిశీలన
ప్రభుత్వ స్కూల్స్ లో పౌష్టికాహారం, మౌలిక వసతుల పై రాష్ట్ర విద్యా కమీషన్ చైర్మన్ ఆకునూరి మురళీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం అమ్రాబాద్ మండలం పిటిజి, ప్రభుత్వ హైస్కూల్ ను పరిశీలించారు. పాఠశాలల్లో భవనాల పరిస్థితి, మధ్యాహ్న భోజనం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే అధికారికంగా నివేదికలు రాసి పంపాలని సూచించారు. విద్యార్థులతో కలిసి ప్రభుత్వ హై స్కూల్ నందు మధ్యాహ్న భోజనం చేశారు.

సంబంధిత పోస్ట్