నాగర్ కర్నూల్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లాలో 10, 598 మంది రెగ్యులర్ విద్యార్థులు రాస్తుండగా ప్రైవేటుగా 45 మంది పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.