తమ్ముడిపై దాడి చేసిన అన్న.. ఆత్మహత్య

62చూసినవారు
తమ్ముడిపై దాడి చేసిన అన్న.. ఆత్మహత్య
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామానికి చెందిన బీరయ్య, రాజు ఇద్దరు అన్నదమ్ములు. అన్న రాజుకు చెందిన పెంపుడు కుక్కను తమ్ముడు బీరయ్య కొట్టాడు. ఆగ్రహించిన రాజు బీరయ్యపై కర్రతో దాడిచేశాడు. దీంతో బీరయ్య సోమవారం రాజుపై బిజినేపల్లి పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. విచారణ కోసమని రాజుని స్టేషన్ కు పిలిచిన పోలీసులు మళ్లీ రావాలన్నారు. కాగా బుధవారం రాజు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్