నాగర్ కర్నూల్ జిల్లాలో పూర్తిగా ఇసుక కొరత ఉన్నదని దీనితో నిర్మాణరంగ పనులు పూర్తిగా ఆగిపోయాయని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు రాముడు అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఇసుక కొరతతో వేలాదిమంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇసుక కొరతపై అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలన్నారు.