తిమ్మాజీపేట్ మండలం బాజీపూర్ గ్రామంలో నిర్వహించిన మహనీయుల జాతర గొడ పత్రికలు మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర EC మెంబర్ పృధ్వీరాజ్ మాట్లాడుతూ ఈ నెల 26న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం జడ్పీ గ్రౌండ్ లో బహుజన్ సమాజ్ పార్టీ ఆద్వర్యంలో నిర్వహించే మహనీయుల జాతరకు పార్టీలకు, కులాలకు మతాలకు అతీతంగా అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.