బసవేశ్వరుని విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని వినతి

85చూసినవారు
బసవేశ్వరుని విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని వినతి
నారాయణపేట మండలం సింగారం చౌరస్తాలో నూతన బసవేశ్వరుని విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని కోరుతూ శనివారం నారాయణపేట సివిఆర్ భవన్ లో వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పర్ణిక రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను ఎమ్మెల్యేకు వివరించారు. వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయం అని సంఘం జిల్లా అధ్యక్షులు రవి కుమార్ అన్నారు.

సంబంధిత పోస్ట్