నారాయణపేట పట్టణానికి చెందిన దివంగత న్యాయవాది మద్దూరు బస్వరాజు కూతురు మద్దూరు స్వాతి డాక్టరేట్ సాధించారు. హైదారాబాద్ ఉస్మానియా యునివర్సిటీ కి చెందిన ప్రొఫెసర్ శివరాజ్ వద్ద రసాయన శాస్త్ర విభాగంలో చేసిన పరిశోధనలకు గాను డాక్టరేట్ సాధించారు. ఈ మేరకు హైదారాబాద్ లో శనివారం జరిగిన కార్యక్రమంలో యునివర్సిటీ అధికారులు డాక్టరేట్ పట్టాను అందజేశారు. విద్యావంతులు, కుటుంబ సభ్యులు అభినందించారు.