ఎస్జిటి బదిలీల వెబ్ ఆప్షన్స్ కు అదనపు సమయం ఇవ్వాలి

80చూసినవారు
ఎస్జిటి బదిలీల వెబ్ ఆప్షన్స్ కు అదనపు సమయం ఇవ్వాలి
జిల్లాలో ఎస్జీటీ బదిలీల వెబ్ ఆప్షన్స్ ఆపివేసి ఒకరోజు అదనంగా సమయం ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేర్ కృష్ణారెడ్డి, నరసింహ డిమాండ్ చేశారు. ఆదివారం నారాయణపేట డీఈవో కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. బదిలీల కోసం సిద్ధం చేసిన సీనియార్టీ జాబితాపై ఎలాంటి అభ్యంతరాలు తీసుకోకుండానే బదిలీలకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం సరికాదని అన్నారు. అనేక బడులలో ఖాళీలు చూపించలేదన్నారు.

సంబంధిత పోస్ట్