బాలల హక్కులు, చట్టాలపై అవగాహన

53చూసినవారు
బాలల హక్కులు, చట్టాలపై అవగాహన
నారాయణపేట మండలం చిన్నజట్రంలో ఉపాధిహమీ పనులు చేస్తున్న కూలీలకు శుక్రవారం బాలల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించినట్లు చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా కో ఆర్డినేటర్ నర్సింహులు తెలిపారు. పిల్లలను బాల కార్మికులుగా పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 18 ఏళ్ల లోపు బాలికలను వివాహాలు చేయరాదని, అలా చేయటం చట్టరీత్యా నేరమన్నారు. బాల కార్మికులు కనిపిస్తే 1098 నంబరు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు

సంబంధిత పోస్ట్