దామరగిద్ద మండలం క్యాతన్ పల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో సఖి కేంద్రం ద్వారా అందించే సేవలపై శుక్రవారం మహిళలకు అవగాహన కల్పించినట్లు సఖి కేంద్రం సభ్యులు కవిత, చంద్రకళ తెలిపారు. గృహ హింస, అదనపు వరకట్న వేధింపులు, దాడులకు గురైతే సఖి కేంద్రంలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చేయరాదని అన్నారు. పిల్లలకు విద్యను అందించాలని సూచించారు.