డెంగ్యూ వ్యాధి నిర్ములనపై అవగాహన ర్యాలీ

56చూసినవారు
జాతీయ డెంగ్యూ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నారాయణపేట పట్టణంలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద జిల్లా వైద్య అధికారి సౌభాగ్యలక్ష్మి జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రధాన రహదారులు గుండా ర్యాలీ నిర్వహించి వీరసవార్కర్ చౌరస్తాలో ప్రతిజ్ఞ చేశారు. దోమలు రాకుండా ప్రజలు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సౌభాగ్యలక్ష్మి చెప్పారు.

సంబంధిత పోస్ట్