పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లాలో మట్టి వినాయకులను పంపిణీ చేస్తామని అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయనాలతో చేసిన విగ్రహాలతో నీటి కాలుష్యం ఏర్పడుతుందని అన్నారు. అధికారులు పాల్గొన్నారు