రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ గురువారం దామరగిద్ద మండలం కానుకుర్తి అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మహేష్, రాములు, మోహన్, నాయకులు పాల్గొన్నారు.