దన్వాడ: గ్రామస్తులకు చట్టాలపై అవగాహన

54చూసినవారు
దన్వాడ: గ్రామస్తులకు చట్టాలపై అవగాహన
ధన్వాడ మండలం కిస్టాపూర్, రాంకిష్టయపల్లి గ్రామాలలో శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గ్రామస్తులకు చట్టాలపై అవగాహన కల్పించారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ.. వివిధ రకాల చట్టాలపై అవగాహన కల్పించారు. పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సలహాలు అందించేందుకు జిల్లా కోర్టులో న్యాయవాదులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని భారత ప్రభుత్వం కల్పించిందన్నారు.

సంబంధిత పోస్ట్