శాంతి భద్రతల రక్షణలో డయల్ 100 సేవలు కీలకమని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు బుధవారం నారాయణపేట జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న బ్లూ కోర్ట్స్, పెట్రో కార్స్ పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధితులు డయల్ 100 కు ఫోన్ చేసిన వెంటనే పోలీసులు స్పందించాలని, ఘటన స్థలానికి చేరుకొని బాధితులకు సహాయం అందించాలని అన్నారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.