మరికల్ కు చెందిన యువ న్యాయవాది అయ్యప్ప రష్యా లో జారుతున్న 16వ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్నారు. బ్రిక్స్ సమావేశంలో తెలంగాణ నుండి పాల్గొన్న మొదటి ఏకైక వ్యక్తిగా యువ న్యాయవాది అయ్యప్ప నిలిచారు. ఈ సందర్భంగా పలు దేశాల మంత్రులు, ప్రతినిధులను కలిశారు. భవిష్యత్తులో బ్రిక్స్ దేశాలు డాలర్ ఆధారపడకుండా కామన్ కరెన్సీ విధానం తీసుకొని రావడం కొరకు సమావేశంలో చర్చ జరిగిందని చెప్పారు.