నారాయణపేట జిల్లా ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన కమిటీని గురువారం నారాయణపేట పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నూతన జిల్లా అధ్యక్షుడు డిఈఈ కేతన్ కుమార్ తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా కిరణ్ కుమార్, కోశాధికారిగా రవికుమార్ లను ఎన్నుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మద్దిగట్ల కృష్ణ, మహబూబ్ నగర్ డిఈఈ శ్రీనివాస్ గౌడ్, విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.