మోస్తరు వర్షంతో ఆనందంలో రైతులు

57చూసినవారు
నారాయణపేట పట్టణం తోపాటు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. ఓ వైపు ఎండ, మరో వైపు వర్షం ఒకసారిగా రావడంతో విచిత్ర వాతావరణం నెలకొంది. మోస్తరు వర్షానికి కంది, పత్తి, పెసర పంటలకు మేలు చేకూరుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాలలు వదిలే సమయంలో వర్షం రావడంతో విద్యార్థులు, పనులు నిమిత్తం బయటికి వెళ్ళిన ప్రజలు కాస్త ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్