తెలంగాణ డీఎస్సీ ఫలితాల్లో నారాయణపేట(D) మరికల్(M) రాకొండకు చెందిన తండ్రీకొడుకులు సత్తా చాటారు. 50 ఏళ్ల జంపుల గోపాల్.. రెండు విభాగాల్లో జిల్లాస్థాయిలో మొదటి ర్యాంకు, మూడో ర్యాంకు పొందారు. ఆయన కుమారుడు భానుప్రకాశ్ 9వ ర్యాంకు సాధించారు. ఇదే జిల్లా కోస్గి మండలం ముక్తిపహాడ్ కు చెందిన ఈడ్గి కృష్ణయ్య జిల్లాస్థాయిలో రెండో ర్యాంకు, ఆయన సోదరుడు ఈడ్గి రమేశ్ 11వ ర్యాంకు పొందారు.