మద్దూర్ మండల పరిధిలోని పరిసర గ్రామాలలో గురువారం తెల్లవారుజాము నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆకాశం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని ఉరుములు ఉరిమి వర్షం మొదలైంది. ఇటీవల కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలలో రైతులు పత్తి, జొన్న ఇతర పంటలు వేశారు. ఈ వర్షం వల్ల రైతులకు కొంతవరకు మేలు జరుగుతుందని పలువురు అంటున్నారు. రైతన్నలు సంతోషంతో ఉన్నారు.