మంత్రి పదవి రావడానికి కారకులైన మక్తల్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారి మంగళవారం సాయంత్రం మక్తల్ వచ్చిన శ్రీహరిని కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ట్యాంక్ బండ్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. మక్తల్ ట్యాంక్ బండ్ పై ఉన్న బసవేశ్వరుడి విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి పూజలు చేశారు. భారీగా కార్యకర్తలు, నాయకులు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.