కోస్గి మండల ప్రజాపరిషత్ కార్యాలయావరణలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 134 వ వర్థంతి సందర్భంగా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసిల్దార్ శ్రీనివాసులు, మండల అభివృద్ధి అధికారి శ్రీధర్ వచ్చారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.