విద్యలో జిల్లాను ఉన్నత స్థానంలో నిలుపుదాం: కలెక్టర్

82చూసినవారు
విద్యలో జిల్లాను ఉన్నత స్థానంలో నిలుపుదాం: కలెక్టర్
విద్యాపరంగా జిల్లాను ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు సమిష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో విఐపి సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల స్థాయిలో పదవ తరగతి పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించి అభినందించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్