నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూర్ పెద్ద పీర్ల గడ్డలో ప్రతిష్ఠించిన హసేన్, హుస్సేన్ పీర్ల సవారి శనివారం అర్ధరాత్రి జరిగింది. ఈ సవారీ ఉత్సవాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్కూల్ గ్రౌండ్ జాతర మైదానంలో విద్యుత్ లైట్లతో ఏర్పాటు చేసిన రంగుల రాట్నాలు, వివిధ రకాల ఆట బొమ్మలు, గాజులు, మిఠాయి దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో వెలిశాయి. పండుగ సందడి వాతావరణం నెలకొంది.